భవిష్యత్ తరాలు దెబ్బతినబోతున్నాయి : యనమల

by  |
YCP MPs must resign said by yanamala ramakrishnudu
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్దామని సీఎం జగన్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఈ సవాల్‌ను స్వీకరించడానికి జగన్‌కు చంద్రబాబు 48 గంటల సమయం ఇచ్చారు. జగన్ స్పందించకపోతే 48 గంటల తర్వాత మళ్లీ మీడియా ముందుకొస్తానని కూడా బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తాజాగా ఈ అంశంపై యనమల స్పందించారు. చంద్రబాబు సవాల్‌ను జగన్‌ స్వీకరించాలని ఆయన చెప్పారు. అసెంబ్లీని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని.. రాజధాని అనేది రాష్ట్ర ప్రజల సమస్య అని యనమల మీడియా ముఖంగా తెలిపారు. జగన్‌ మోసం వల్ల 13 జిల్లాల అభివృద్ధి కుంటుపడుతోందని.. భవిష్యత్ తరాలు దెబ్బతినబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. జగన్ తుగ్లక్ పాలన నుంచి ఏపీని రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని యనమల పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed