కడప జిల్లాకు సీఎం జగన్ చేసిందేమీ లేదు..

by srinivas |
Srinivasureddy
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సొంత జిల్లాలో సీఎం జగన్ పర్యటనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రెండున్నరేళ్ల పాలనలో జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పటికే మూడు సార్లు కడపలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి వేల కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. శంకుస్థాపనలు చేశారే తప్ప ఆ పనులు నేటికి పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు.

పునాదిరాళ్లు వేసిన పనుల పురోగతిపై జగన్ ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా? అని శ్రీనివాసులరెడ్డి నిలదీశారు. గత రెండేళ్లుగా సీఎం జగన్ చేసిన శంకుస్థాపనను పరిశీలిస్తే బాగుంటుందని సూచించారు. పేరుకే శంకుస్థాపనలు తప్ప పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల అన్నమయ్య కట్ట తెగిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయారని.. ఇప్పటి వరకు ఆ కట్ట పునరుద్ధరణ పనులు కూడా చేపట్టలేదని ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యడు శ్రీనివాసులరెడ్డి విమర్శించారు.

Next Story