- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం ఆధీనంలోకి ఎయిడెడ్ విద్యాసంస్థలు అనేది కుట్ర- ఎమ్మెల్సీ అశోక్‌బాబు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని జీవో విడుదల చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఈ జీవో వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి అప్పగించేందుకు నిరాకరిస్తున్న వారిపై ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి విద్యాసంస్థలను అప్పగించేందుకు విముఖత చూపిస్తున్న 12 విద్యాసంస్థలపై ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. ఆయా విద్యాసంస్థల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చినట్టు, కౌన్సిలింగ్ ఇస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎయిడెడ్ కాలేజీల స్థలాలు, వాటి ఆస్తులను స్వాధీనం చేసుకునే పనిలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. విద్యా విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తప్పనిసరిగా ఉంటుందన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని ఎయిడెడ్ విద్యాసంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు.