- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ ఎంపీ కోలుకోవాలంటూ ట్వీట్లే.. ట్వీట్లు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా బారినపడ్డాడంటూ మీడియాలో కథనాలు వస్తుండడం పట్ల టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయంగా వైరుధ్యం ఉన్నా మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను విజయసాయిరెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు. మరో నేత వెంకన్న కూడా స్పందించారు.
రాజకీయంగా ఇద్దరం ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్పా వ్యక్తిగతంగా తమకేం విభేదాలు లేవన్నారు. విజయసాయిరెడ్డి కరోనా బారినపడటం బాధాకరం అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఇక టీడీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సెటైరికల్ గా స్పందించింది. “క్వారంటైన్ కు వెళుతున్నా అని చెప్పుకోవడం ఎందుకు, నాకు కరోనా పాజిటివ్ అని చెప్పుకోవచ్చుగా.. వై దిస్ కొలవెరి..?” అంటూ సెటైర్ వేసింది.
Next Story