గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన టీడీపీ నేతలు.. ఆయన ఏం చెప్పారంటే..?

by  |   ( Updated:2021-10-21 01:51:45.0  )
AP-Governor1
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతల దాడులను నిరసిస్తూ టీడీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. ఇప్పటికే ఈ దాడులపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్ బీబీ హరిచందన్‌తో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరగా.. గురువారం సాయంత్రం 5 గంటలకు ఖరారు చేసినట్లు టీడీపీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, ఇతర టీడీపీ నేతలు గవర్నర్‌‌ హరిచందన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర కార్యాలయంతోపాటు జిల్లాలోని టీడీపీ కార్యాలయాలపై దాడులు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి.. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై గవర్నర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారు.

Advertisement

Next Story