- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం జగన్ సత్తా చూపించాలి.. టీడీపీ నేత సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి విందులు చేయడం.. ఒకరినొకరు పొగడ్తలు గుప్పించుకుంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు సీఎంలు ఒకరినొకరు ప్రేమించుకోవడం ఆపి నదులపై కర్ణాటక, మహారాష్ట్ర నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని సూచించారు. ఆదివారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన పొరుగు రాష్ట్రాలు డ్యామ్‌లు కడితే కృష్ణా నది ఎడారి అయిపోతుందని తెలిపారు. సీఎం జగన్‌కు రాజకీయ భిక్ష పెట్టింది రాయలసీమ ప్రజలేనన్నారు.
పోలవరం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులతో 80 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు వస్తున్న నేపథ్యంలో ఆ మేరకు శ్రీశైలం నుంచి రాయలసీమకు నికర జలాలు అధికారికంగా సాధించాలని సూచించారు. సీఎం జగన్ తన సత్తా చూపించి రాయలసీమ వాసుల రుణం తీర్చుకోవాలని హితవు పలికారు. మరోవైపు కృష్ణా జలాల విషయంలో జగన్, కేసీఆర్‌తో రాజీపడడం సరికాదన్నారు. కృష్ణా జలాలను సముద్రంలోకి వదిలేస్తుంటే జగన్ చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్‌కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యవహరిస్తున్నా.. ఎమ్మెల్యేలు, ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. అల్మట్టి ఎత్తును పెంచడంతో పాటు తుంగభద్ర, బీమా నదులపై కడుతున్న ప్రాజెక్టులతో కృష్ణా నదీజలాల ఆధారిత ప్రాంతం డేంజర్ జోన్‌లో పడినట్లేనని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.