- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ నేత కాలేజీలో ప్రశ్నించిన విద్యార్థులకు శిక్ష
విశాఖపట్టణంలోని టీడీపీ నేత కళాశాలలో ప్రశ్నించిన విద్యార్థులను సెల్లార్‌లో బంధించి ఇబ్బంది పెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ పేరిట ప్రైవేటు జూనియర్ కాలేజీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల్ని జాయిన్ చేసుకునే సమయంలో ఎన్డీయే పరీక్షకు సిద్ధం చేస్తామని, తమ కాలేజీకి వందశాతం రికార్డుందంటూ ప్రచారం చేయించుకునే ఎమ్మెల్యే ఫీజులు దండిగానే వసూలు చేస్తారు.
అయితే జాయిన్ చేసుకున్నప్పుడు చెప్పిన మాటలు ఏడాది చివర్లో కానీ నీటిమూటలని విద్యార్థులకు అర్థం కాలేదు. దీంతో ప్లేగ్రౌండ్ లేదు, హార్స్ రైడింగ్ ఏది?, భోజనం బాగోడం లేదు ఎందుకు? అంటూ విద్యార్థులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీంతో కాలేజీ యాజమాన్యం 100 మంది విద్యార్థులను సెల్లార్‌లో పెట్టి బంధించింది. ఇది మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.