ఓటీఎస్‌ విషయంలో వైసీపీపై  విరుచుకుపడ్డ టీడీపీ నేత

by srinivas |   ( Updated:2021-12-11 08:14:47.0  )
tdp pithala sujatha
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో వైసీపీ నేతలు ఇప్పటి వరకు గనులు, లిక్కర్, భూములు, ఇసుకను దోచుకున్నారని.. తాజాగా పేదలను దోచుకునేందుకు సిద్ధమయ్యారని మాజీమంత్రి పీతల సుజాత ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శనివారం ఆమె మాట్లాడుతూ పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందన్నారు. కరోనా, ప్రకృతి వైపరీత్యాలతో పేదలు కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం ఓటీఎస్ కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అంతేకాదు గత ప్రభుత్వాలు చేసిన పనులను తామే చేసినట్టుగా జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. 1983 నుంచి పేదలకు ప్రభుత్వాలు ఇళ్లను కట్టించాయని… ఇప్పుడు ఓటీఎస్ పేరుతో వేల కోట్లను వసూలు చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అయ్యిందని విమర్శించారు. ఓటీఎస్ పథకం విషయంలో పేదలెవరూ ప్రభుత్వానికి డబ్బులు కట్టొద్దని సూచించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. అప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తుందని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందంటూ మాజీమంత్రి పీతల సుజాత విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed