- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఐడీ విచారణకు సహకరిస్తాం.. తేడా చేస్తే మీ భరతం పడతాం
దిశ,వెబ్‌డెస్క్: రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసుల వ్యవహారంపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు.
రాజధానిపై మొదటి నుంచీ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని బోండా ఉమ మండిపడ్డారు. అధికారులతో కమిటీ, మంత్రుల సబ్ కమిటీ కూడా వేశారు. కానీ ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎక్కడా జరగలేదని హైకోర్ట్ స్పష్టం చేసిందన్నారు. మేం ఎక్కడా భయపడడం లేదు. మేం అక్రమాలు చేయలేదు కాబట్టే ఇన్నాళ్లు మమ్మల్ని ఏం చేయలేదని, సీఐడీ నోటీసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. సీఐడీ నోటీసులు ఇచ్చినంత మాత్రానా అది నిజమైపోదన్న బోండా.., సీఐడీ చెప్పిందే వేదం కాదు.. న్యాయం మావైపు ఉంది.. మాకు భయం లేదు. సీఐడీ నోటీసులు వేధింపు చర్యలు తప్ప మరేమీ కాదని స్పష్టం చేశారు. సీఐడీ అనేది సుప్రీం కోర్ట్ కాదు.. ఒక సంస్థనే .. సీఐడీ నోటీసులు ఇచ్చారు.. విచారణకు హాజరవుతామన్నారు. మేం చెప్పిన సమాధానంపై సంతృప్తి పడకుండా వేధిస్తే మేం కూడా న్యాయపరంగా ముందుకు వెళ్తాం. నిజమైన ఆధారాలుంటే 21నెలలుగా ఏం చేశారని ప్రశ్నించారు. కావాలనే రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆవేదన వ్యక్తం చేశారు.