- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీకట్లో చీటింగ్ చేసి ఛైర్‌పర్సన్‌గా వచ్చారు
దిశ, వెబ్‌డెస్క్: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సంచయితపై టీడీపీ నేత అనిత ఫైర్ అయ్యారు. ఆనంద గజపతిరాజు మొదటి భార్య ఉమకు ఎప్పుడో విడాకులు ఇచ్చారన్న అనిత.. ఆమె కుమార్తె సంచయిత చీకట్లో చీటింగ్ చేసి ట్రస్ట్ ఛైర్ పర్సన్‌గా వచ్చారని ఆరోపించారు. మాన్సాస్ ట్రస్ట్ బైలాస్ ప్రకారం పురుష వారసుడే ట్రస్ట్‌కి ఛైర్మన్‌గా ఉండాలనే నిబంధన ఉందని, కానీ సింహాచల భూములపై కన్నేసిన జగన్ సర్కార్ సంచయితను ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా నియమించిందని విమర్శించారు. ఛైర్ ఫర్సన్‌గా సంచయిత సక్రమంగా నియమించబడి ఉంటే సంబంధించిన జీవోను ఎందుకు వెబ్‌సైట్లో పెట్టలేదన్నారు. జగన్ పుర్రెకు పుట్టిన బుద్ధిని అధికారులు అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
పదవి నిలబడాలంటే చంద్రబాబు, లోకేశ్‌పై ఆరోపణలు చేయడం తప్ప సంచయితకు గత్యంతరం లేదన్నారు. ట్రస్ట్ పరిధిలోని పెద్ద ఉద్యోగులు జీతాలు తీసుకుంటుంటే కిందిస్థాయిలో జీతాలు తీసుకునే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గోశాలకు చంద్రబాబు కేటాయించిన 125ఎకరాలపై వైసీపీకి చెందిన పెద్ద డేగ కన్ను పడిందని అన్నారు. హోంమంత్రి స్ర్కిప్ట్ చూసి కూడా మాట్లాడలేక పోతున్నారని, ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.