- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాటా ఓపెన్ జరిగేనా?
దిశ, స్పోర్ట్స్ : దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నీ అయిన టాటా ఓపెన్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి పూణేలో జరగాల్సి ఉంది. తాజాగా ఏటీపీ కొత్త ఏడాదిలోని తొలి ఏడు వారాల క్యాలెండర్ ప్రకటించింది. ఇందులో ఫిబ్రవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు చోటు కల్పించింది. కానీ టాటా ఓపెన్ ఊసే ఎత్తలేదు. దీంతో ఇండియాలో జరిగే ఏకైనా ఏటీపీ టోర్నీ 2021లో జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై టోర్నీ డైరెక్టర్ ప్రశాంత్ సుతార్ వివరణ ఇచ్చారు. ‘ఏటీపీ నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు క్వారంటైన్ లేకపోతేనే టోర్నీలు నిర్వహించాలి. క్వారంటైన్స్‌లో ఉండటం వల్ల ప్లేయర్ల విలువైన సమయం వృధా అవుతున్నదనే ఏటీపీ ఈ నిర్ణయం తీసుకున్నది.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనే క్రీడాకారులు ముందుగానే దుబాయ్ క్వాలిఫయర్స్ ఆడటం, మరి కొంత మందిని అన్ని వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక విమానాల్లో లాస్ ఏంజెల్స్, సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాకు తరలిస్తున్నారు. అందుకే కొన్ని రోజులు వెనక్కు జరిపి ఆ టోర్నీ నిర్వహిస్తున్నారు. కాగా, మహారాష్ట్రలో మాత్రం విదేశాల నుంచి వచ్చే వారికి కనీసం 14 రోజుల క్వారంటైన్ నిర్ణయించారు. అందుకే టాటా ఓపెన్‌ను ప్రస్తుతానికి వాయిదా వేశారు’ అని ఆయన చెప్పారు. కోవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత టాటా ఓపెన్ కొత్త తేదీని ఏటీపీ నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.