- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమర్షియల్ వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్
దిశ, వెబ్‌డెస్క్: వాహన పరిశ్రమలో ఇప్పటికే అరడజనుకు పైగా వాహన కంపెనీలు వచ్చే ఏడాది నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి. తాజాగా దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా వాహన ధరలను పెంచనున్నట్టు సోమవారం ప్రకటించింది. టాటా మోటార్స్ జనవరి 1 నుంచి కమర్షియల్ వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించినట్టు, పరికరాల ధరలు పెరగడమే కాకుండా ఉత్పత్తి వ్యయం అధికమవడమే దీనికి కారణమని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ముడి పదార్థాలు, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, బీఎస్6 నిబంధనలు మారడం వాహనాల వ్యయం పెరగడానికి కారణమని కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో పాక్షికంగా ప్రభావాన్ని తగ్గించేందుకు ధరలను పెంచాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఈ ధరల మార్పు మోడల్, వేరియంట్, ఇంధన రకాలపై ఆధారపడి ఉంటాయని, మీడియా, భారీ కమర్షియల్, తేలికపాటి కమర్షియల్, స్మాల్ కమర్షియల్, బస్సుల పోర్ట్‌ఫోలియోలలో ధరల పెరుగుదల ఉంటుందని కంపెనీ తెలిపింది.