- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిరాయికి ‘టాటా’కారు
దిశ, వెబ్‌డెస్క్: టాటా మోటార్స్ (Tata Motors) సోమవారం తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ నెక్సాన్ (SUV Nexan) కోసం లిమిటెడ్ పీరియడ్ సబ్స్క్రిప్షన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కస్టమర్ వాహనాన్ని నెలకు రూ. 34,900 చొప్పున లీజుకు తీసుకునే వీలుంటుంది. ఈ ఆఫర్ తొలి 100 కస్టమర్లకు మాత్రమే లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ కింద, కస్టమర్లు 18 నుండి 36 నెలల వరకు కార్లను లీజుకు తీసుకోవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు పొందవచ్చని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ సేవలను ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, పూణె, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్లలో అందిస్తున్నట్టు పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత ఆయా కస్టమర్లు దాన్ని కొనసాగించవచ్చు లేదంటే వాహనాన్ని తిరిగి ఇవ్వొచ్చని వెల్లడించింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లను ఆకర్షించడానికి, కంపెనీ తన ప్రధాన కారు నెక్సాన్‌ను అద్దెకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లు వారి అవసరానికి అనుగుణంగా కనీసం 18 నెలలు, 24 నెలలు, 36 నెలల లీజు సభ్యత్వాన్ని ఎంచుకోవచ్చు.
‘తమ కొత్త ఎలక్ట్రిఫయింగ్ సబ్స్క్రిప్షన్’ ఆఫర్ ద్వారా భవిష్యత్తులో అత్యంత ఆసక్తికరంగా మారనున్న ఎలక్ట్రికల్ వాహనాల కస్టమర్లను ఆకర్షిస్తుందని, ఈ ఆఫర్ మరింత మంది కస్టమర్లకు అందుబాటులోకి ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడానికి రూపొందించామని’ టాటా మోటార్స్ హెడ్ పంకజ్ చెప్పారు. ఈ ఆఫర్ కింద కస్టమర్లు తమ ఇంటి వద్ద లేదంటే కార్యాలయంలో అనువుగా ఉండే విధంగా కాంప్లిమెంటరీ పర్సనల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్‌ను పొందుతారని కంపెనీ తెలిపింది.