- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ కోసం బయోబబుల్ సృష్టిస్తాం: టాటా గ్రూప్
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ తేదీలు, వేదికలను ఆదివారం గవర్నింగ్ కౌన్సిల్ నిర్ధారించింది. ప్రస్తుత కరోనా కాలంలో సురక్షితంగా లీగ్‌ను నడిపించడమే బీసీసీఐ ముందున్న బాధ్యత. బయోబబుల్ వాతావరణంలో ఆడిన ఇంగ్లాండ్-వెస్టిండీస్ సిరీస్ విజయవంతమైంది. కాగా, అంతకు ఎన్నో రెట్లు పెద్దదైన ఐపీఎల్ కోసం బయోబబుల్ వాతావరణ సృష్టిస్తామని టాటా గ్రూప్‌కు చెందిన టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో టాటా గ్రూప్ ప్రతినిధులు దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఐపీఎల్‌లో ఆటగాళ్లు, సిబ్బంది, అంపైర్లు, యాజమాన్యం, అధికారులు అందరి ఆరోగ్యాలకు పూర్తి రక్షణ ఉండేలా, అత్యంత అధునాతనమైన సాంకేతికతను ఉపయోగించి కొవిడ్ నుంచి భద్రత అందిస్తామని టాటా ప్రతినిధులు వివరించారు. ఐపీఎల్ జీసీ కౌన్సిల్ సభ్యులు టాటా ప్రతిపాదన, ప్రెజెంటేషన్‌కు ముగ్దులయ్యారని. ఈ వారాంతంలోగా దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఒప్పందం ఖరారైతే టాటా గ్రూప్, యూఏఈ మెడికల్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి బయోబబుల్ వాతావరణం సృష్టించనుంది.