రేపు ఈటల ఇంటికి బీజేపీ నేత.. ఎందుకంటే..?

by Shyam |   ( Updated:2021-06-10 09:37:59.0  )
రేపు ఈటల ఇంటికి బీజేపీ నేత.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలకు ఆజ్యంపోస్తూ రేపు ఈటల ఇంటికి బీజేపీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్ రానున్నారు. బీజేపీలో ఈటల చేరిక, పార్టీలో బాధ్యతలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈనెల 14న బీజేపీలోకి ఈటల చేరనున్నట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు మరో కొంతమంది నేతలు జేపీనడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story