- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరోజు మరిచిపోలేను : తాప్సీ
దిశ, వెబ్‌డెస్క్: తాప్సీ పన్ను.. ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంది. కెరియర్ తొలినాళ్లలో ఎలా ఉన్నా.. బాలీవుడ్‌కు వచ్చేసరికి మాత్రం ఎక్స్‌పరిమెంటల్ మూవీస్ చేసి సక్సెస్ అందుకుంది. ‘పింక్, బద్లా, థప్పడ్’ లాంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. ఈ క్రమంలోనే 2019లో మరో ప్రయోగం చేసింది తాప్సీ. సినిమాల నుంచి కొంచెం డిఫరెంట్ జోనర్‌లోకి వెళ్లి, స్టాండప్ కామెడీ చేసింది. చేయడమే కాదు శభాష్ అనిపించుకుంది కూడా. సాధారణంగా ప్రతీ సినిమా గురించిన పిక్ షేర్ చేసి అందుకు సంబంధించిన స్టోరీ చెప్పే తాప్సీ.. ఇప్పుడు కూడా స్టాండప్ కామెడీ పిక్ షేర్ చేసి, ఆరోజు ఎంత టెన్షన్ పడిందో వివరించింది.
స్టాండప్ కామెడీ చేసేందుకు వెళ్లిన ఆ క్షణాలను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని చెప్పింది తాప్సీ. చాలా నర్వస్‌గా ఫీల్ అయ్యానని.. ఎలా కనిపిస్తున్నాను.. ఏం చేస్తానో అర్థం కాని స్థితిలో ఉన్నట్లు చెప్పింది. కానీ ‘నా హాస్యం ప్రేక్షకుల ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను’ అని తెలిపింది. సూపర్ ఎనర్జీతో సూపర్ షో చేయగలిగానని.. అది తలుచుకుంటే చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పింది. మరీ ముఖ్యంగా టికెట్ డబ్బులు ఎవరూ వెనక్కి అడగలేదంటూ ఫన్నీ పోస్ట్ పెట్టింది తాప్సీ.
https://www.instagram.com/p/CFgnwoFpYFq/?utm_source=ig_web_copy_link
దీనిపై స్పందించిన అభిమానులు తను ఏదైనా చేయగలదని చెప్తున్నారు. ఎప్పటిలాగే ప్రతీ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. కాగా అనురాగ్ కశ్యప్ విషయంలో సపోర్ట్ చేసిన తాప్సీని కొందరు విమర్శిస్తే మరికొందరు మాత్రం పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు.