- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, సహాయక చర్యలు అభినందనీయంగా ఉన్నాయని సీపీఐ (ఎం) నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో సీపీఐ(ఎం) పార్టీకి సంబంధించిన విజ్ఞాన కేంద్రాలు, పార్టీ ఆఫీసులు ఉపయోగించుకోవచ్చు అని ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన లేఖ పలు అంశాలు లేఖలో వెల్లడించారు. కరోనా వైరస్ విస్తరించకుండా గ్రామస్థాయి వరకు ప్రజా ప్రతినిధులాంత ప్రజలకు అందుబాటులో ఉండాలన్న పిలుపును సీపీఐ(ఎం) పార్టీ సంపూర్ణంగా బలపర్చుతుందని తెలిపారు. ప్రభుత్వం కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా ప్రకటించిన అన్ని పద్దతులను సీపీఐ (ఎం) పార్టీ, ప్రజా సంఘాలు పాటిస్తున్నయన్నారు. రాష్ట్రంలో వైరస్ మరింత విజృభించకుండా ఉండాలంటే అందరం ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ఉద్దేశంతో విషయాలను తెలియజేస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం ఆ లేఖలో తెలియజేశారు.
tag: thammineni veerabhadram, letter, CM KCR