- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతిమయ ప్రభుత్వాలపై ఉద్యమించాలి : తమ్మినేని పిలుపు
దిశ, హుజూర్‌నగర్: అవినీతిమయంగా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో ప్రారంభమైన సీపీఎం రెండవ జిల్లా మహసభలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగం పెరిగిపోయిదని ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, విశాఖ స్టీల్ కంపెనీ, సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలను ప్రైవేట్ కంపనీలకు అమ్మేందుకు చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ హక్కులను కాపాడేవారిపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్లచట్టాలు రద్దుకై దేశవ్యాప్తంగా ప్రజలు, రైతులు చేసిన ఉద్యమానికి తలొగ్గిన మోడీ ఆ చట్టాలను రద్దు చేశారని గుర్తుచేశారు. అదే విధంగా కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాటాలు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్నామని, మరల వాటికోసమే సీఎం కేసీఆర్ పాలనలో ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూపంపీణీ, కేజీ టు పీజీ విద్య, ఉద్యోగాల భర్తీ హామీలు అమలు చేయలేదన్నారు. అన్ని రంగాలలో అవినీతి పెరిగిపోయిందన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య ఉద్యమ స్ఫూర్తితో సీపీఎం శ్రేణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, అవినీతి పాలనపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు స్థానిక ఇందిరా చౌక్ నుండి పీఎస్ఆర్ సెంటర్ వరకు డప్పు వాయిద్యాలు, కోలాటాలతో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చెరుకుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, మల్లు లక్ష్మీ, ములకలపల్లి రాములు, ధీరావత్ రవినాయక్, కొలిశెట్టి యాదగిరి, నెమ్మాది వెంకటేశ్వర్లు, బుర్రి శ్రీరాములు, నాగారపు పాండు, పులిచింతల వెంకట్ రెడ్డి, అనంతప్రకాష్, నగేష్, యాకూబ్, భూక్య పాండు, ములకలపల్లి సీతయ్య, పోసనబోయిన హుస్సేన్, దుగ్గి బ్రహ్మం, శీతల రోషపతి, చిన్నం వీరమల్లు తదితరులు పాల్గొన్నారు.