- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వడ్డీ రద్దు చేయాలి..
– సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
దిశ, న్యూస్‌బ్యూరో : మహిళా స్వయం సహాయక పొదుపు సంఘాల బ్యాంక్ రుణాల చెల్లింపును వాయిదా వేసి వడ్డీలను రద్దు చేయాలని సీపీఐ(ఎం)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.6 లక్షల స్వయం సహాయక పొదుపు సంఘాల్లో 51 లక్షల మంది మహిళలు సంఘటితమై ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై బ్యాంకు రుణాలకు సంబంధించి ప్రతి నెల వాయిదాలు చెల్లించలేకపోతున్నట్టు పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వమే మహిళా సంఘాలపై బ్యాంకు అధికారుల ఒత్తిళ్లు లేకుండా.. నెలవారి కిస్తీలు వాయిదా వేయడంతో పాటు వడ్డీలను రద్దు చేసి వారిని ఆదుకోవాలన్నారు. ప్రతి పొదుపు సంఘానికి రూ.10 లక్షల రుణం ఇచ్చి ఆర్థిక సాధికారత సాధించేలా తోడ్పడాలని సీఎం కేసీఆర్‌ను లేఖ ద్వారా కోరారు.
Tags: Bank, Interest, self help groups, Kcr, V, CPI(M)