- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డుపై అడ్డంగా గోడలు నిర్మించిన అధికారులు!
దిశ, చిత్తూరు: కరోనా తలుచుకుంటే క్వారంటైన్‌కి కొదవా అని…కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అనేక ప్రాంతాల్లో అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో కరోనా విజృంభనను నిలువరించేనుకు తమిళనాడు అధికారులు రోడ్డుకు అడ్డంగా గోడలను నిర్మించారు. ఆంద్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో మొత్త మూడు చోట్ల రహదారికి అడ్డంగా గోడలను నిర్మించారు. ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తున్నందున ఏపీ నుంచి ఎవరూ తమ రాష్ట్రానికి రాకుండా, భద్రత కోసమే ఈ గోడలను కట్టామని అక్కడి అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని తిరుత్తని మార్గంలో ఉన్న శెట్టింతంగాల్‌కు వెళ్లే రహదారిలో ఓ గోడను నిర్మించగా, మలమనేరు సమీపంలో ఉన్న గుడియాత్తాం వెళ్లే దారిలో మరొకటి, బొమ్మసముద్రంలో తమిళనాడుకు వెళ్లే మార్గంలో ఇంకొక గోడను కట్టారు. ఒకవేళ అత్యవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లా అధికారులు స్పష్టం చేశారు.
Tags: Tamilnadu officials, build a road, corona virus, covid-19, chittor