హీరో అజిత్ ఇంట్లో బాంబ్ కలకలం.. ఆందోళనలో ఫ్యాన్స్

by Anukaran |   ( Updated:2021-06-01 03:41:42.0  )
హీరో అజిత్ ఇంట్లో బాంబ్ కలకలం.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తమిళ్ సూపర్ స్టార్ అజిత్ ఇంట బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. హీరో అజిత్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్‌ రావడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే అజిత్ ఇంటి వద్ద తనిఖీలను ముమ్మురం చేశారు. హీరో అజిత్‌ కుటుంబం ప్రస్తుతం చెన్నైలోని తిరువాన్మియూరులో నివాసముంటున్నారు. అయితే మంగళవారం అజిత్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు జాగిలాలతో ఇల్లు మొత్తం తనిఖీ చేసిన పోలీసులు ఇంట్లో ఎలాంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. ఎవరో ఆకతాయిలు ఇలాంటి కాల్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక అజిత్ ఇంట్లో బాంబ్ పెట్టారని తెలియడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అజిత్ ‘వాలిమై’చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది.

Advertisement

Next Story