31వరకు లాక్‌డౌన్ పొడిగించిన తమిళనాడు

by vinod kumar |
31వరకు లాక్‌డౌన్ పొడిగించిన తమిళనాడు
X

చెన్నై : మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే తమిళనాడు సర్కారూ అలాంటి నిర్ణయాన్నే వెల్లడించింది. తమిళనాడు కూడా మే 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు 10వేల కరోనా కేసులు రిపోర్ట్ అయిన ఈ రాష్ట్రంలో.. మే 31వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు, మతపరమైన ప్రదేశాలు, సినిమా హాళ్లు, బార్లు మూసే ఉండనున్నాయి. లాక్‌డౌన్ 4.0కు సంబంధించి ఆంక్షలతోపాటు సడలింపులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో లాక్‌డౌన్ ఆంక్షల్లో పలు మినహాయింపులనిచ్చింది. 12 జిల్లాల్లో మాత్రం అదనంగా ఎటువంటి సడలింపులనూ ఇవ్వలేదు. లాక్‌డౌన్ మినహాయింపులకు సంబంధించి మే 11న అమల్లోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం గతవారమే కీలక నిర్ణయాలను ప్రకటించింది. దుకాణాల్లో పని గంటల పెంపు, ప్రైవేటు కంపెనీల్లో తక్కువ సిబ్బందితో ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చింది. చెన్నై మినహా షాపులు, ప్రైవేటు సంస్థలపై పలు ఆంక్షలను సడలించింది. హైవేలపై పెట్రోల్ పంపులు 24 గంటలు పనిచేసేందుకు అవకాశమిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed