- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సూపర్ కాప్.. వీధుల్లో కనిపిస్తే కాల్చేస్తాడు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ వచ్చి ఇప్పటికే ఏడాది దాటిపోగా, దాన్ని నివారించేందుకు మాస్క్ పెట్టుకోవడం అనివార్యమైంది. అయితే.. ఏదో మొక్కుబడిగా మాస్క్ ధరించేవారు కొందరైతే, వాడేసిన మాస్క్‌లను రోడ్లమీద పడేసేవాళ్లు మరికొందరు. కొవిడ్ ఉన్నా, లేకపోయినా మనం వాడిన మాస్క్‌లను అలా రోడ్ల మీద పడేయడం వల్ల జంతువులకు, ప్రకృతికి నష్టం కలుగుతుందనే సివిక్ సెన్స్ కూడా లేకుండా మనం వ్యవహరిస్తున్నాం. కాగా అలా వీధుల్లో పడేసిన మాస్క్‌లను తమిళనాడు, రామంతపురానికి చెందిన సుభాష్ శ్రీనివాసన్ అనే కానిస్టేబుల్ కలెక్ట్ చేస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నాడు.
రామంతపురంలోని పొలీస్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుభాష్.. అటు కర్తవ్య నిర్వహణతో పాటు ఇటు సమాజ సేవకు పాటుపడుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. 2013లో ప్రమాదవశాత్తు బావిలోపడ్డ ఓ మూడేళ్ల చిన్నారిని రక్షించిన శ్రీనివాసన్‌ను తమిళనాడు ప్రభుత్వం ‘గ్యాలంట్రీ అవార్డు’ ఇచ్చి సత్కరించగా, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ తను చేస్తున్న సేవలకుగాను గతేడాది సీఎం చేతుల మీదుగా ‘మెడల్ ఆఫ్ హానర్’ అందుకున్నాడు. ఒక పౌరుడిగా సమాజసేవలోనూ ముందుండే శ్రీనివాసన్.. మే నుంచి ఇప్పటివరకు వీధుల్లో పడేసిన 20 వేలకు పైగా మాస్క్‌లను కలెక్ట్ చేసి, వాటిని జాగ్రత్తగా డిస్పోజబుల్ చేస్తుండటం విశేషం.
‘నేను కూడా కొవిడ్ బారినపడి బ్రీతింగ్ విషయంలో చాలా ఇబ్బందిపడ్డాను. అందుకే కొవిడ్ జాగ్రత్తలు తప్పక పాటించండి. అయితే కొవిడ్ మనకు వస్తే వైద్యం చేయడానికి డాక్టర్లు ముందుకొస్తున్నారు. కానీ వీధిలో తిరిగే మూగజీవాలకు వస్తే ట్రీట్‌మెంట్ ఎలా? అని ఎవరూ ఆలోచించడం లేదు. మనం పడేసే మాస్క్‌లను ఆవులు, కుక్కలు, మేకలు నమలడం నేను కళ్లారా చూశాను. ఏ ఒక్క మాస్క్ వల్లనైనా వాటికి ఇన్‌ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయే అవకాశముంది. అంతేకాదు దానివల్ల మనుషులకు కూడా ప్రమాదమే. అందుకే ప్రతి రోజూ ఉదయం వీధుల్లో పడేసిన మాస్క్‌లను ఏరుతున్నాను. మున్సిపల్ ఉద్యోగులు కూడా ఈ పనిచేస్తారు కానీ చెత్తతో పాటే వీటినే కలిపేస్తారు. అలా చేయడం కూడా కరెక్ట్ కాదు, వాటిని విడిగా వేరుచేయాలి కానీ వారికి ఇది అదనపు భారం కావడంతో వాళ్లు చేయడం లేదు. అందుకే నేనే స్వయంగా వాటిని కలెక్ట్ చేసి, కాల్చేస్తున్నాను’ అని శ్రీనివాసన్ తెలిపాడు.
శ్రీనివాసన్‌లా మనం సమాజసేవ చేయకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యతగల పౌరుడిలా ఇతరులకు ఇన్‌ఫెక్షన్ రాకుండా మాస్క్ ధరించండి. మనం ధరించేది డిస్పోజబుల్ మాస్క్ అయితే దాన్ని రోడ్ల మీద, చెత్తబుట్టిలో పడేయకుండా కాల్చేయండి.