ఏసు ప్రభువు చూపిన మార్గంలో పయనించాలి : తలసాని శ్రీనివాస్ యాదవ్

by Shyam |   ( Updated:2021-12-10 06:42:56.0  )
Talsani Srinivas Yadav
X

దిశ, కంటోన్మెంట్: మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం. నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసు ప్రభువు చూపిన మార్గంలో పయనిస్తూ తోటివారికి సహాయం చేయాలనే సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. క్రిస్మస్ కి నెల రోజుల ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా వేడుకలు ఎంతో సంబరంగా జరుపుకుంటారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పేద క్రైస్తవులు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో నూతన దుస్తులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్ లను అందించడంతో పాటు ప్రభుత్వ పరంగా క్రిస్మస్ విందులను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతో మంత్రిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రెవరెండ్ విజేహెచ్ఎస్ నీల్సన్, వైస్ ప్రెసిడెంట్ జోయల్, జనరల్ సెక్రటరీ సాల్మన్ రాజ్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story