రెచ్చిపోయిన తాలిబన్లు.. ఆఫ్ఘన్ పౌరులపై బుల్లెట్ల వర్షం

by vinod kumar |   ( Updated:2021-08-18 06:53:52.0  )
talibans
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తమను వ్యతిరేకిస్తున్న వారికి నరకం చూపిస్తున్నారు. ఆ దేశంలో ఓ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతుండగా, వారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆఫ్ఘన్ ప్రజలు విదేశాల సాయం కోరుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో విమానాల కోసం పడిగాపులు గాస్తున్నారు.

అయితే, తాలిబన్ల నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చి ఆఫ్ఘన్ జాతీయ జెండాను ప్రదర్శించిన నిరసన కారులపై బుల్లెట్ల వర్షం కురిసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాలిబన్లు కాల్పులు జరపడంతో పెద్దఎత్తున ఆందోళకారులు భయంతో పరుగులు తీశారు.

బేక్రింగ్: దిశ నిందితుల కుటుంబాలకు సిట్ నోటీసులు

Advertisement

Next Story

Most Viewed