ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దండయాత్ర.. స్పందించిన ఐరాస

by vinod kumar |
Taliban terrorists, UNO
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా భద్రతా బలగాలు వెనుదిరిగిన నాటినుంచి తాలిబన్లు చెలరేగిపోతున్నారు. ఎలాగైనా ఆఫ్ఘానిస్తాన్‌ను వశం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే మొత్తం దేశాన్ని దాదాపు అదుపులోకి తీసుకోగా, మరో రెండు కీలక నగరాలు మిగిలి ఉన్నట్లు సమాచారం. విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతూ ఆఫ్ఘాన్‌లో అల్లర్లు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలపై దాడులకు సైతం పాల్పడుతున్నారు. పిల్లలు, మహిళలను దారుణంగా చంపేస్తున్నారు. ఆఫ్గనిస్తాన్‌లో ఆ దేశ దళాలపై పోరును ఆపాలని ఐక్యరాజ్యసమితి హెడ్ ఆంటోనియో గెటర్స్ తాలిబన్లకు పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పట్ల విశ్వాసం చూపాలని, శాంతి నెలకొనేందుకు చర్చలు ముఖ్యమని, ఈ విషయంలో అవసరమైతే తాము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గత ఎన్నో దశాబ్దాలుగా ఆఫ్ఘన్ యుద్దాలు, ఘర్షణలతో అట్టుడుకుతూ వచ్చిందన్నారు. దీర్ఘకాలంగా ఆ దేశ ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని ఆయన చెప్పారు.

Advertisement

Next Story