- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మానకొండూరులో విషాదం.. కరెంట్ షాక్‌తో మహిళ మృతి
by Sridhar Babu |

X
దిశ,మానకొండూరు : విద్యుత్ షాక్‌తో మహిళ మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. కన్నాపూర్ గ్రామానికి చెందిన శీలం సరిత అనే మహిళ మిషన్ కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది.
తన దినచర్యలో భాగంగా సరిత కుట్టు మిషన్‌ను సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఈరోజు మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న కేశవపట్నం ఎస్సై బండ ప్రశాంత్ ఘటనా స్థలికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలిపారు. సరిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Next Story