- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘నా బాయ్ ఫ్రెండ్ ఎవరో.. ఇంట్లో తెలుసు’
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమాతో కెరీర్ ఆరంభించిన తాప్సి.. ఇక్కడ ఆశించిన స్థాయిలో హిట్లు రాకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. బాలీవుడ్ లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుని విజయాలు దక్కించుకుంది. దాంతో పాటు అక్కడ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. బాలీవుడ్ లో బ్రేక్ అందుకున్న తాప్సి ఇటీవలే ‘థప్పడ్’ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మరో మూడు హిందీ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న తాప్సి వ్యక్తిగత విషయాల్లోనూ కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే తాప్సీ ప్రేమలో ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఆ వార్తలపై తాప్సి ఎప్పుడు స్పందించలేదు. కానీ, ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ఎవరో క్లారిటీ ఇచ్చేసింది.
చాలా రోజులుగా తాప్సి ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ మాథియాస్ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు పలు సందర్బాల్లో బయట కనిపించినా కూడా అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. తాజాగా ఈ ప్రచారాలకు తాప్సి సమాధానం చెప్పింది. తన ప్రియుడి విషయం కుటుంబ సభ్యుల దగ్గర దాచలేదని, వారికి అతని గురించి తెలుసని తాప్సి పేర్కొంది. తన కుటుంబ సభ్యులు కూడా వారి ప్రేమకు అంగీకరించారని తెల్పింది. తన ప్రేమని తల్లిదండ్రులు అంగీకరించినందుకే అందరికీ చెప్పగల్గుతున్నానని లేదంటే ఇప్పటికీ నోరు విప్పేదాన్ని కాదని ఆమె తెలిపింది. తన పేరేంట్స్, సిస్టర్స్ ఇష్టపడని వ్యక్తిని తాను ఒప్పుకోలేనని తాప్సీ చెప్పింది. ‘‘నటిగా ఇన్నాళ్లు దక్కించుకున్న మంచి పేరును, నా ప్రేమ వ్యవహారం వల్ల అది తగ్గిపోకూడదనే ఉద్దేశ్యంతో చెప్పలేదు. పేరేంట్స్ ఒప్పుకోకపోతే ఏ ప్రేమ కూడా జీవితాంతం ఉండదు. నా వాళ్ల దగ్గర విషయాల్ని దాచడం నాకు ఇష్టం ఉండదు’ అని తాప్సి చెప్పుకొచ్చింది.