22 దేశాల్లో టాప్ టెన్‌ మూవీగా ‘హసీన్ దిల్‌రుబా’

by  |   ( Updated:2021-07-26 08:43:49.0  )
Haseen-Dillruba
X

దిశ, సినిమా : నెట్‌ఫ్లిక్స్‌ ప్రీమియం మూవీ ‘హసీన్ దిల్‌రుబా’ మిక్స్‌డ్ రివ్యూలు దక్కించుకుంది. సినిమాలోని ఎక్స్‌ట్రా మారిటల్ ఎఫైర్స్, డొమెస్టిక్ వయొలెన్స్‌ సీన్లపై కొందరు విమర్శలు గుప్పించగా.. మరికొందరు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన గుడ్ న్యూస్‌ మూవీ టీమ్‌కు ఉత్సాహానిచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సినిమా గ్లోబల్ వైడ్‌గా ఆదరణ పొందుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ కో- సీఈవో, చీఫ్ కంటెంట్ ఆఫీసర్ టెడ్ సారండోస్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఈ ఇంటర్వ్యూ కాపీని ట్విట్టర్‌లో షేర్ చేసిన తాప్సీ.. తమ చిత్రం ఇంత త్వరగా సరిహద్దులు దాటుకుని పాపులారిటీ సాధించడంలో హెల్ప్ చేసినందుకు ఆయనకు థాంక్స్ చెప్పింది. ఇక టెడ్ చెప్పిన ప్రకారం..‘ఇండియాలో మా పని ఇప్పుడే మొదలైంది. లోకల్ స్టోరీ టెల్లర్స్‌తో కలిసి పనిచేస్తున్నాం. గతేడాది నుంచి మా సినిమాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ‘జగమే తంత్రం’ ఇదే కోవకు చెందిన సినిమా కాగా, ప్రస్తుతం ‘హసీన్ దిల్‌రుబా’ 22 దేశాల్లో టాప్ 10లో కొనసాగుతోంది’ అని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed