కోలన్ ఇన్ ఫెక్షన్ ఎలా వస్తుంది?

by sudharani |
కోలన్ ఇన్ ఫెక్షన్ ఎలా వస్తుంది?
X

దిశ, వెబ్ డెస్క్: జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులను మనందరం ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొంటూ ఉంటాం. ఒక సందర్భంలో ఆకలి మందగిస్తుంది. మరోసారి అజీర్తి చేస్తుంది. ఇంకోసారి తిన్న వెంటనే పొట్టలో మంట మొదలవుతుంది. అయితే మన జీర్ణ వ్యవస్థలో చివరన ఉండేదే పెద్దపేగు. వ్యర్థాలను బయటకు పంపించడంలో చురుగ్గా పని చేస్తుంది. అయితే పొత్తి కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, పెద్ద పేగు లోపలి పొరల్లో మంటగా ఉండటం, కొలన్ కేన్సర్ కు ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. పెద్దపేగు కేన్సర్ ముదిరితేనే ప్రమాదం. తొలి దశలో ఏలాంటి ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్ ఫెక్షన్స్, బాక్టీరియా, వైరస్ వల్ల కొలైటిస్ వచ్చే అవకాశం ఉంది. కలుషితమైన నీళ్లు తాగడం వల్ల, ఆహారం తినడం మూలాన కూడా కొలైటిస్ రావొచ్చు.రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కూడా ఇది వస్తుంది. విపరీతమైన మలబద్దకం ఉండటంతో పాటు, మరికొన్ని రోజులు వీరేచనాలు అవుతూ ఉంటాయి. ఈ రెండు తరుచుగా వస్తుంటే.. కొలైటిస్ లక్షణంగా చెప్పొచ్చు. కొలైటీస్ లో పలు రకాలున్నాయి.

బాలీవుడ్, హాలీవుడ్ లలో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్. అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించిన విషయం తెలిసిందే. కోలన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ.. కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇర్ఫాన్ మరణించారు. అయితే కొలన్ ఇన్ఫెక్ష న్ లో చాలా రకాలున్నాయి. దేనివల్ల ఏం జరుగుతుందో తెలుసుకోవడం వల్ల ముందుగానే వైద్య చికిత్సలు తీసుకుని అవకాశం ఉంటుంది.

ఇన్ ఫ్లమేటరీ ఓవెల్ సిండ్రోం (ఐబీడీ) :
ఐబీడీ అనేది క్రానిక్ డిసీజ్ ల గ్రూప్ గా చెప్పొచ్చు. ప్రధానంగా ఐబీడీ వల్ల జీర్ణకోశంలో మంట ఏర్పడుతుంది.

ఇస్కెమిక్ కొలైటిస్ :
పెద్దపేగులో కొంత భాగానికి రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే ఇస్కెమిక్ కొలైటిస్ వస్తుంది. ముఖ్యంగా రక్తనాళాలు చిన్నవిగా అయినప్పుడు లేదా బ్లాక్ అయినప్పుడు రక్తప్రసరణ జరగదు. దాంతో జీర్ణవ్యవస్థలోని కణాలకు సరిపడా ఆక్సిజన్ అందదు. దానివల్ల పెద్దపేగులో నొప్పి రావడంతో పాటు, దాని పనితీరును తీవ్రంగా నష్టపరుస్తుంది.

అలెర్జిక్ రియాక్షన్స్ :
అలెర్జిక్ కొలైటిస్ పెద్దవారిలో కంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రెండు, మూడు శాతం పిల్లల్లో ఈ రకమైన కొలైటిస్ వస్తుంది. పాలల్లోని ప్రోటీన్స్ కు చిన్న పిల్లల్లోని జీర్ణవ్యవస్థ ఓవర్ రియాక్ట్ కావడమే అలెర్జిక్ కొలైటిస్ కు దారితీస్తుంది.

మైక్రోస్కోపిక్ కొలైటిస్ :
లింఫోసైట్స్ పెరిగినప్పుడు మైక్రోస్కోపిక్ కొలైటిస్ వస్తుంది. ఈ కొలైటిస్ ని మైక్రోస్కోప్ ద్వారానే చూడగలుగుతాం. దీన్నే లింఫోసైటిక్ కొలైటిస్ అని కూడా అంటారు. దీనివల్ల విరేచనాలు ఎక్కువగా అవుతుంటాయి.

డ్రగ్ ఇన్ డ్యూస్డ్ కొలైటిస్ :
కొంతమంది ఎన్ఎస్ఏఐడీ (nsids) అనే యాంటీ ఇన్ ఫ్లేమేటరీ మందులను తరుచుగా వాడుతూ ఉంటారు. వాటి ప్రభావం వల్ల పెద్దపేగులో మంట రావచ్చు. ఇదే డ్రగ్ ఇన్ డ్యూస్డ్ కొలైటీస్ కి దారి తీయొచ్చు.

కొలైటిస్ లక్షణాలు :
చాలా కారణాల వల్ల కోలన్ ఇన్ ఫెక్షన్స్ రావచ్చు. కారణాన్ని బట్టి లక్షణాలు మారతాయి. కానీ రక్త విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, విపరీతమైన విరేచనాలు, వికారం, బరువు తగ్గడం, నీరసం ఇవి అందరిలోనూ కామన్ గా కనిపించే కొన్ని లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.

tags :colon, colon infection, colitis, colon cancer

Advertisement

Next Story

Most Viewed