- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జొమాటోకు పోటీగా స్విగ్గీ.. రూ. 41 వేల కోట్లతో
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ నిధుల సమీకరణలో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే జొమాటో కంపెనీ ఐపీఓ ద్వారా భారీగా నిధులను సమీకరించింది. తాజాగా స్విగ్గీ సైతం రూ. 9,345 కోట్లను సేకరించినట్టు ప్రకటించింది. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2, ప్రోసస్‌ల నుంచి ఈ నిధులను అందుకున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2 సంస్థ మొదటిసారిగా భారత ఫుడ్ డెలివరీ విభాగంలో పెట్టుబడులు పెట్టినట్టు పేర్కొంది. కాగా, తాజాగా నిధుల సమీకరణ ద్వారా స్విగ్గీ సంస్థ విలువ 5.5 బిలియన్ డాలర్ల(రూ. 41 వేల కోట్లకు) చేరుకుందని వెల్లడించింది.
టెక్నాలజీ, ఆరిటిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగాల్లో సంస్థ సామర్థ్యాలను మెరుగుపరుస్తామని, ఇంజనీరింగ్, ప్రోడక్ట్, డేటా సైన్స్, ఎనలిటిక్స్ సహా సరఫరా, వ్యాపార నిర్వహణ అంశాల్లో మరింత బలోపేతం కానున్నట్టు స్విగ్గీ వివరించింది. “దేశీయంగా ఫుడ్ డెలివరీ పరిధి విస్తృతమైంది. రాబోయే కొన్నేళ్లలో దీన్ని మరింత పటిష్టం చేసేందుకు పెట్టుబడులను కొనసాగిస్తాం. ఎక్కువ భాగం పెట్టుబడులు ఆహారేతర విభాగాల్లో ఉంటాయని” స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మెజెటీ అన్నారు. కాగా, ఫుడ్ డెలివరీ పరిశ్రమలో స్విగ్గీకి పోటీగా ఉన్న జొమాటో ఇటీవల ఐపీఓ ద్వారా భారీగా నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నిధులతో జొమాటో కంపెనీ విలువ రూ. 64 వేల కోట్లకు పైగా పెరిగిందని సంస్థ వెల్లడించింది.