- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇర్ఫాన్ స్మరణలో భార్య..
by Shyam |
X
యూనివర్సల్ యాక్టర్ ‘ఇర్ఫాన్ ఖాన్’ మరణించి అప్పుడే రెండు నెలలు గడిచిపోయాయి. ఏప్రిల్ 29న క్యాన్సర్‌తో కన్నుమూసిన ఇర్ఫాన్ మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక కుటుంబం గురించైతే చెప్పక్కర్లేదు. ఆయన లేకుండా జీవించడం భార్య సుతప, పిల్లలు బాబిల్ ఖాన్, అయాన్ ఖాన్‌లకు చాలా కష్టంగా ఉందని గతంలో తన పోస్ట్‌తో కంటతడి పెట్టించిన సుతప.. మరోసారి తన భర్తను స్మరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
తన ఇంటి దగ్గర విరబూసిన తామర పూల ఫొటోలు షేర్ చేసిన సుతప.. ‘తామరలు నిన్ను గుర్తు చేసుకుంటున్నాయి ఇర్ఫాన్.. మీరు వీటిని సీసాలో తీసుకురావడానికి.. ఇక్కడ వికసించే స్థలం సృష్టించేందుకు ఎంత కష్టపడ్డారో గుర్తుందా’ అంటూ గుర్తుచేసుకుంది. తనను తామరలు మాత్రమే కాదు తాము కూడా మిస్సవుతున్నామన్న సుతప.. ఇర్ఫాన్ ప్రకృతిని చాలా ప్రేమించే వాడని చెప్పింది.
Advertisement
Next Story