చీరాల ఎస్సై విజయ్ కుమార్ సస్పెన్షన్

by  |
చీరాల ఎస్సై విజయ్ కుమార్ సస్పెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా చీరాల ఎస్సై విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ గంగాధర్ మంగళవారం ఉత్వర్వులు జారీ చేశారు. మాస్క్ ధరించలేదన్న కారణంతో.. చీరాల పోలీసులు కిరణ్ కుమార్‌ అనే యువకుడిపై దాడి చేయడంతోనే అతడు మృతి చెందాడన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎస్పీ ఉత్వర్వుల్లో వెల్లడించారు.

అసలు ఏం జరిగిందంటే:

ప్రకాశం జిల్లా చీరాల మండలం థామస్‌పేటకు చెందిన కిరణ్ కుమార్(26).. ఈ నెల 19వ తేదిన తన స్నేహితుడితో కలిసి కొత్తపేట వైపు వెళ్తున్నాడు. ఈ సమయంలో అతడు మాస్క్ ధరించలేదు. దీంతో కొత్తపేట ఔట్ పోస్టు వద్ద ఎస్సై విజయ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే, మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో కిరణ్ కుమార్‌ను పోలీస్ జీపులో స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరోసారి వాగ్వాదం జరినట్లు సమాచారం. తనను విచక్షణ రహితంగా దాడి చేశారని కిరణ్ కుమార్, అతడి స్నేహితుడు ఔట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలైన కిరణ్ అదే రోజు గుంటూరులోని ప్రేవేటు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. కాగా, చికిత్స పొందుతూనే మృతి చెందాడు.

దీంతో బాధిత కుంటుంబీకులు ఎస్సై విజయ్ కుమార్ దాడిలోనే కిరణ్ చనిపోయాడని ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే విజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.



Next Story

Most Viewed