ఎన్నికల వేళ..తెలంగాణ సీఎం రేవంత్‌కు చంద్రబాబు బిగ్ షాక్?

by Disha Web Desk 18 |
ఎన్నికల వేళ..తెలంగాణ సీఎం రేవంత్‌కు చంద్రబాబు బిగ్ షాక్?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. అటు ఏపీలో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి పైన గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్‌కు చాలా తక్కువ సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచారు. ఇక ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ అన్ని పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పొత్తుల ప్రభావం తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల పైన చూపుతోందని అంటున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ మద్దతు లభించింది.

కానీ ప్రజెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలనే ప్రణాళికలతో బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలంగాణ టీడీపీ నేతలతో చర్చలు జరిపారు. చ‌ర్చ‌ల అనంత‌రం టీడీపీ తెలంగాణలో బీజేపీకి మద్ధతు ఇవ్వాలని నిర్ణ‌యించింద‌ని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపినట్లు సమాచారం.

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈనెల 10వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ రానున్నార‌ని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మోడీ పాల్గొనే బహిరంగ సభలో పాల్గొనాలని చింత‌ల ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతు ఇవ్వాలని మంత్రి పొంగులేటి వంటి నేతలు నేరుగా టీడీపీ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరినట్లు సమాచారం. ఇప్పుడు టీడీపీ మద్దతు బీజేపీకి ఇస్తున్నట్లు తెలియడంతో ఇది తెలంగాణలో పలు చర్చలకు దారితీస్తుంది.

Next Story