తమిళ్ మూవీ రీమేక్ బై మెగా డాటర్.. హీరో ఎవరో?

by Shyam |
తమిళ్ మూవీ రీమేక్ బై మెగా డాటర్.. హీరో ఎవరో?
X

దిశ, సినిమా : మెగా డాటర్ సుస్మిత కొణిదెల ‘ఖైదీ నెం. 150, సైరా, రంగస్థలం’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసి శభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించి నిర్మాతగా మారిన ఆమె.. తొలి సిరీస్ ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ ద్వారా సక్సెస్ అందుకుంది. కాగా ప్రస్తుతం సినిమాను నిర్మించే పనిలో ఉందట సుస్మిత. ‘8 థొట్టక్కల్’ అనే తమిళ్ మూవీ రైట్స్ సొంతం చేసుకున్న ఆమె, తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు వినికిడి.

తెలుగు నేటివిటీ ప్రకారం కథలో మార్పులు ఉంటాయని తెలుస్తుండగా, త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఓ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సర్వీస్ పిస్టల్ మిస్ చేసుకుంటాడు. ఆ రివాల్వర్‌ను దొంగలించిన వ్యక్తి దాన్ని ఎవరికి అమ్మాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ‘8 థొట్టక్కల్’ కథ. వెట్రి, అపర్ణ బాలమురళి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు శ్రీ గణేష్ దర్శకుడు కాగా, ఎం. వెళ్లపాండియన్ నిర్మించారు.

Advertisement

Next Story