తెలంగాణ చిన్మమ్మకు అరుదైన గౌరవం..

by Shamantha N |
తెలంగాణ చిన్మమ్మకు అరుదైన గౌరవం..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ చిన్నమ్మకు అరుదైన గౌరవం దక్కబోతోంది. రాష్ట్ర సాధనలో భాగంగా పార్లమెంటులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టినపుడు ఆమె మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉభయసభల్లో బిల్లు పాస్ అయి, రాష్ట్రం ఆవిర్భవించాక సుష్మస్వరాజ్‌ను చిన్మమ్మగా తెలంగాణ ప్రజలు భావించారు. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగా ప్రధాని మోడీ కేబినెట్‌లో సుష్మ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగారు.

2019లో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరాక అనారోగ్యం కారణంగా రెండోసారి మంత్రిత్వ బాధ్యతలు స్వీకరించలేదు. ఢిల్లీలోని ఏయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 6వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారు. అంతముందు సుష్మస్వరాజ్ మధ్యప్రదేశ్‌లోని విదిశ నియోజకవర్గం నుంచి 2009, 2014లో రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. సుష్మస్వరాజ్ విద్యార్థి దశ నుంచి బీజేపీ పార్టీకి అందించిన సేవలు ఎనలేనవి. ఇదిలాఉండగా, ఫిబ్రవరి-14 సుష్మస్వరాజ్ పుట్టిన రోజు. దీంతో ఆమె చిత్రపటానికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో సుష్మస్వరాజ్‌కు విగ్రహం ఏర్పాటు చేయించనున్నట్లు ఆదివారం ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed