- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చి.ల.సౌ. ‘స్ర్పైట్’
సుశాంత్..అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఒకరు. తాత వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుశాంత్.. కరెంట్, చిలసౌ లాంటి సినిమాలతో బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు. ఈ మధ్య అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురం సినిమాలో స్పెషల్ రోల్ వేసి మెప్పించిన ఈ యంగ్ హీరో..లేటెస్ట్‌గా కమర్షియల్ యాడ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ కూల్‌డ్రింక్ ‘స్ర్పైట్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. సుశాంత్‌కు ఇది తొలి కమర్షియల్ యాడ్ అయినా.. సూపర్ కూల్‌గా కనిపించి అదరగొట్టాడు. ఎప్పటిలాగే చమత్కారంగా ఉన్న ఈ యాడ్ హిందీ వెర్షన్‌లో హీరో ఆయుష్మాన్ ఖురానా, తాప్సీ నటించగా..తమిళ్ వెర్షన్‌లో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ చేశాడు.
ప్రస్తుతం రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో బిజీగా ఉన్న సుశాంత్..వాణిజ్యరంగంలోకి అడుగుపెట్టినందుకు అతడి ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.