సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమాని ఆత్మహత్య

by srinivas |
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమాని ఆత్మహత్య
X

దిశ, ఏపీ బ్యూరో: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమాని వైజాగ్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. సుశాంత్ సింగ్‌కు మల్కాపురం మండలం శ్రీహరిపురంలోని పవనపుత్రనగర్‌కు చెందిన సుమన్ కుమారి వీరాభిమాని. సుమన్ కుమారి టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తుండేది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడిన నాటి నుంచి అభిమానులు టిక్‌టాక్‌లో చేస్తున్న వీడియోలు చూస్తూ వేదనకు గురయ్యారు. పదేపదే వీడియోలు చూడటంతో కుంగుబాటుకు లోనై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుమన్ కుమారి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మల్కాపురం పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story