- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సూర్యాపేట కార్మికురాలికి నేషనల్ అవార్డు
దిశ, సూర్యాపేట: ఉత్తమ కోవిడ్ వారియర్ పురస్కారం తెలంగాణా రాష్ట్రం నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మున్సిపల్ కార్మికురాలు మెరుగు మారుతమ్మకు దక్కింది. ఈ అవార్డును కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతులమీదుగా ఆదివారం ఢిల్లీని విజ్ఞానభవన్‌లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. జాతీయ మహిళా కమిషన్ 29వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కాగా, కోవిడ్ సందర్భంగా విధించిన లాక్‌డౌన్‌లో విశేష సేవలందించిన పలువురు మహిళలను, అధికారులను కమిషన్ గుర్తించి జాతీయ మహిళల కమిషన్ ప్రత్యేక పురస్కారాలను అందజేసింది. ఈ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం నుంచి సూర్యాపేట మున్సిపల్ కార్మికురాలు శ్రీమతి మెరుగు మారుతమ్మను ఎంపిక చేశారు. దీంతో తన నియోజకవర్గానికి చెందిన మారుతమ్మ జాతీయస్థాయి అవార్డునకు ఎంపిక కావడం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.