అమెరికాలో రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట వాసి మృతి

by Anukaran |
Chirusai
X

దిశ సూర్యాపేట : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా వాసి మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో సూర్యాపేట వాసి నరేంద్రుని చిరుసాయి(22)అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి వద్ద నరేంద్రుని లింగమూర్తి, సుధారాణి కుమారుడు నరేంద్రుని చిరుసాయి మాస్టర్స్ చదివేందుకు ఈ యేడాది జనవరిలో అమెరికాకు వెళ్లాడు. డిసెంబర్ 15న ఇండియాకు రానుండడంతో ఫ్రెండ్స్‌తో కలిసి షాపింగ్ వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో భారీగా మంచు కురవడంతో ఆయన ప్రయాణిస్తున్న కార్‌ను ఎదురుగా వచ్చిన్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే కారులో ప్రయాణిస్తున్న నల్లగొండకు చెందిన మరో యువతికి తీవ్రంగా గాయపడడంతో కోమాలోకి వెళ్లింది.

resident killed

సాయి మృతదేహాన్నీ ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరో 15రోజులలో రావాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకోవడంతో సూర్యాపేటలో సాయి ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణించిన చిరు సాయి డెడ్ బాడీని ఇండియాకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించి డెడ్ బాడీని ఇండియాకు తెప్పించేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story