అరసవల్లిలో 26న తెప్పోత్సవం

by srinivas |
అరసవల్లిలో 26న తెప్పోత్సవం
X

దిశ,విశాఖపట్నం: క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఈ నెల 26న అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్ వెల్లడించారు. తెప్పోత్సవం, స్వామి వారి స్వర్ణాభరణాల అలంకరణపై శుక్రవారం దేవాలయ సమావేశ మందిరంలో పాలకమండలి సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ… ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రధాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే కార్తీక మాసంలో ఏకాదశి పవిత్రమైనదని, ఆరోజున స్వామి వారి స్వర్ణాభరణాలను స్వామి వారికి అలంకరించడం జరుగుతుందని అన్నారు.

ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో స్వర్ణాభరణాలతో స్వామి వారిని భక్తులు వీక్షేంచేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గతంలో భద్రతా దృష్ట్యా స్వర్ణాభరణాలను అలంకరణ చేయలేదని, వాటితో పాటు ఇటీవల స్వామి వారి కోసం తయారుచేసిన ఆభరణాలను కూడా ఇకపై అలంకరిస్తామని స్పష్టం చేశారు. కరోనా దృష్ట్యా భక్తులెవరినీ స్వామి వారి తెప్పోత్సవానికి అనుమతించడం లేదని, అలాగే దీపాలు వెలిగించే భక్తులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా నాగావళి నదీ తీరంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కోనేరులో ఊరేగే స్వామివారికి పూల అలంకరణతో పాటు విద్యుత్ అలంకరణ ఉంటుందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed