అత్యవసరంగా మానవరహిత డ్రోన్ల కొనుగోలు!

by Shamantha N |   ( Updated:2020-08-14 10:59:31.0  )
అత్యవసరంగా మానవరహిత డ్రోన్ల కొనుగోలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం దృష్ట్యా భారత్ భారీగా ఆయుధాలు సమకూర్చుకుంటుంది. ఈ మధ్యే రాఫెల్ యుద్ధ విమానాలను అమ్ములపొదిలో చేర్చుకుని శత్రులవుకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. భూమి మీద, ఆకాశంలో శత్రువులతో దీటుగా పోరాడగలిగే ఇండియా సముద్ర జలాల్లో చైనా కంటే వెనుకబడి ఉన్నదన్న విషయం కాదనలేనిది. పోరాడే సామర్థ్యం ఉన్నా అత్యాధునిక యుద్ద పరికరాలు, వార్ షిప్స్ చైనాతో పోలిస్తే మనవద్ద తక్కువగా ఉన్నాయి. ఈనేపథ్యంలోనే సముద్ర జలాల్లో నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు యుద్ధనౌకలపై వినియోగించే మానవ రహిత డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత్ నిర్ణయించింది.

ఇండియన్ నేవీ వినతి మేరకు అత్యవసరంగా పది డ్రోన్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. దానికి సంబంధించి సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో కూడిన పది డ్రోన్ల కొనుగోలుకు నేవి ఉన్నతాధికారులు రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన చేశారు. దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం చెలాయిస్తున్న డ్రాగన్ ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా భారతీయ నేవీ సన్నద్ధమవుతోంది.

అందుకోసం సముద్రంపై నిరంతరం నిఘా పెట్టేందుకు పది డ్రోన్ల కొనుగోలు కోసం టెండర్లు పిలువనున్నది. మరోవైపు మడగాస్కర్, మలక్కా స్ట్రైట్ తదితర సముద్ర జలాలపై నిఘాను మరింతగా పటిష్ఠం చేసేందుకు మరో ప్రాజెక్టులో భాగంగా అమెరికా నుంచి సీ గార్డియన్ డ్రోన్లను సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed