- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొట్టుపొట్టు కొట్టుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్..
దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్ పొట్టుపొట్టు కొట్టుకున్నారు. నువ్వు ఒకటి కొడితే నేను రెండు కొడుతా అన్న రేంజ్‌లో కిందపడేసుకుంటూ కాళ్లతో తన్నుకున్నారు. వాళ్లను అదుపుచేసేందుక తోటివారు తీవ్రంగా శ్రమించారు. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. డ్రైనేజీ బిల్లుల విషయంలో ఇరువురికీ వివాదం తలెత్తినట్లు సమాచారం.
పంచాయతీ నిధులను సర్పంచ్ తలారి సాయిలు వాడుకుంటున్నారని ఉపసర్పంచ్ వెంకటేశ్ ఆరోపించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో కార్యాలయంలోనే సర్పంచ్, ఉపసర్పంచ్ బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ప్రజాప్రతినిధులు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ.. బిల్లుల విషయంలో కొట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.