రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్‌గా సురినాం ప్రెసిడెంట్..?

by Shamantha N |
రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్‌గా సురినాం ప్రెసిడెంట్..?
X

న్యూఢిల్లీ : ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సురినాం ప్రెసిడెంట్, భారత సంతతి నేత చంద్రిక పర్సద్ సంతోఖి హాజరవ్వనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయవర్గాలు తెలిపాయి. ఢిల్లీలో రాజ్‌పథ్‌లో నిర్వహించే పరేడ్‌కు సంతోఖి ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నట్టు పేర్కొన్నాయి.

కేంద్ర విదేశాంగ శాఖ నిర్వహించిన ప్రవాస భారతీయ దివస్ సదస్సుకు సంతోఖి ముఖ్య అతిథిగా హాజరవ్వడం గమనార్హం. ఈ సారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు బోరిస్ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సింది. కానీ, యూకేలో కరోనావైరస్ కొత్త వేరియంట్ వెలుగులోకి రావడం, కేసులు విపరీతంగా పెరగడంతో భారత పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు యూకే పీఎం బోరిస్ జాన్సన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed