యూపీ సర్కారుకు 'సుప్రీం' నోటీసులు

by Shamantha N |   ( Updated:2020-11-16 06:11:27.0  )
యూపీ సర్కారుకు సుప్రీం నోటీసులు
X

న్యూఢిల్లీ: కేరళకు చెందిన జర్నలిస్టు సిద్ధిఖ్ కప్పన్ అరెస్టుపై వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తరప్రదేశ్ సర్కారుకు నోటీసులు పంపింది. హాథ్రస్ ఘటనను రిపోర్ట్ చేయడానికి వెళ్లిన పాత్రికేయుడు సిద్ధిఖ్‌ను అక్టోబర్ 5న పోలీసులు అరెస్టు చేశారు. ఉపా చట్టాన్ని ప్రయోగించారు. సిద్ధిఖ్ ప్రాథమిక హక్కులకు భంగం కలుగకూడదని, ఆయనకు న్యాయపరమైన అవకాశాలను తెరిచే ఉంచాలని, కుటుంబీకులతో కలవడానికి అనుమతించాలని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నిస్టులు పిటిషన్ ఫైల్ చేశారు.

ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు సిద్ధిఖ్‌కు న్యాయ అవకాశాలు కల్పించాలని కోరారు. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టునే ఎందుకు ఆశ్రయించారని ఈ పిటిషన్ విచారిస్తున్న సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. ఆ పాత్రికేయుడిని అసాధారణ పరిస్థితుల్లో అరెస్టు చేశారని, ఆర్టికల్ 32లో జోక్యం చేసుకోవాలని జర్నలిస్టు తరఫువాదిస్తున్న అడ్వకేట్ కపిల్ సిబల్ కోరగా, ప్రస్తుతం తాము యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని, ఈ పిటిషన్ విచారణను అలహాబాద్ హైకోర్టుకూ బదిలీ చేసే అవకాశముందని ముందస్తుగానే హెచ్చరిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed