వేతనాలు చెల్లించని కంపెనీలపై ఇప్పుడే చర్యలొద్దు!

by Harish |
supreme court notices to twitter
X

దిశ, సెంట్రల్ డెస్క్: లాక్‌డౌన్ సమయంలో వేతనాలు చెల్లించని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులతో చర్చించుకోవడానికి శుక్రవారం సుప్రీంకోర్టు అవకాశమిచ్చింది. ఈ అంశంపై జూలై చివరి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉద్యోగులు లేకుండా కంపెనీలు మనుగడ సాగించవని అభిప్రాయపడింది. యజమానులు, ఉద్యోగులు తమ విభేదాలను పరిష్కరించుకోవాలని, అనుకూలమైన వాతావరణంలో పనిని తిరిగి ప్రారంభించాలని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపిస్తూ కంపెనీలు, ఉద్యోగులకు మధ్య సయోధ్య కుదిరేలా చూడాలని, దానికి సంబంధించిన నివేదికను కార్మిక శాఖ కమిషనర్లకు ఇవ్వాలని ఆదేశించింది. లాక్‌డౌన్ సమయంలో ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని ఆదేశాలను ఇస్తూ కేంద్ర హోంశాఖ మార్చి 29న ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు చట్టబద్ధత ఏమిటో వివరించాలని, నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి సవాలుగా పలు కంపెనీలు వేసిన పిటిషన్లపై విచారణను జులై చివరికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed