- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ప్రభుత్వానికి సుప్రీం షాక్..
దిశ, వెబ్‌డెస్క్ : ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీం విచారణ జరిపింది. అయితే, వాదోపవాదాల అనంతరం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా.. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ తీర్పు వలన వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
ఇటు కేవియట్ పిటిషన్ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రొఫెసర్లకు రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని 80శాతం మంది స్వాగతిస్తున్నారని.. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించినా ఫలితం లేకుండా పోయింది.