లాక్‌డౌన్ ఎత్తేయండి : సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

by Shamantha N |
supreme court
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా, మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో తాత్కాలిక లాక్‌డౌన్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించాయి. అయితే యూపీలోని కొన్ని జిల్లాల్లో కరోనా తీవ్రత భారీగా పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అలహాబాద్ హైకోర్టు ఐదు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించాలని యోగి సర్కార్‌ను ఆదేశించింది.

దీంతో యూపీ సర్కార్ ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది. తాజాగా దీనిని విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. లాక్‌డౌన్ అవసరం లేదని, కరోనా వ్యాప్తి తగ్గుదలకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్భందీ చర్యలు చేపట్టాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed