మహేష్ .. ట్విట్టర్‌లోనూ 'సరిలేరు నీకెవ్వరూ'

by Shyam |
మహేష్ .. ట్విట్టర్‌లోనూ సరిలేరు నీకెవ్వరూ
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఏమో అనుకున్నాం కానీ… మరీ ఇంతలా అప్ డేట్ ఉంటారు అనుకోలేదు. హీరో అప్ డేట్‌లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ కూడా ఆటోమేటిక్‌గా ఉంటారు కూడా. అందుకే మహేష్ బాబు ట్విట్టర్ ఎకౌంట్ 9 మిలియన్ ఫాలోవర్స్‌కు చేరుకుంది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఇంతమంది ఫాలోవర్స్‌ను సాధించిన తొలి నటుడిగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 2010 ఏప్రిల్‌లో మహేష్ ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేయగా… ఇప్పుడు 90 లక్షల మంది ప్రిన్స్‌ను ఫాలో అవుతున్నారు. కానీ మహేష్ మాత్రం కేవలం 26 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.

ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఫ్యామిలీకి థాంక్స్ చెప్పాడు సూపర్ స్టార్. ఇలాంటి అమేజింగ్ జర్నీలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ అందుకున్న మహేష్ బాబు.. తర్వాతి చిత్రం దర్శకులు వంశీ పైడిపల్లితో చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఆ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే మహేష్ .. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆచార్య’ మూవీలో నటిస్తారని టాక్.

Tags: Mahesh Babu, Superstar, Mahesh Twitter Record, Twitter, Sarileru Neekevvaru

Advertisement

Next Story

Most Viewed