- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్కు ఎఫెక్ట్… లైన్‌మెన్ సస్పెన్షన్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మూలంగా మానవ జీవితంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కాగా గతంలో ఎన్నడూ వాడని కొన్ని వస్తువులు ప్రస్తుతం తప్పనిసరిన వాడాల్సిన పరిస్థతి నేలకొంది. అందులో మాస్కు, సానిటైజర్ అయితే మరీ ముఖ్యంగా తయారయింది. దీనిని ప్రభుత్వాలు కూడా అనివార్యంగా వాడాలని సూచనలు చేస్తోంది. అంతేగాకుండా వాడకపోతే జరిమానాలు విధిస్తోంది. కాగా మాస్కులు ఇవ్వడం లేదని చెప్పినందుకు ఓ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మరువకముందే మరొకటి వెలుగులోకి వచ్చింది.
మాస్కులు ఇవ్వకపోతే తాము విధులు నిర్వహించలేమని చెప్పినందుకు ఓ లైన్‌మెన్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. అతన్ని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన కృష్ణాజిల్లా విస్సన్నపేటలో మంగళవారం చోటుచేసుకుంది.
లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తోన్న అనిల్ కుమార్ ఇటీవల తమకు మాస్కులు, శానిటైజర్లు ప్రభుత్వమే అందించాలని కోరాడు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. వ్యక్తిగత కక్షలతో డీఈ అశోక్ కుమార్ ఇలా చేయడాన్ని బాధితుడు ఖండిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని నూజివీడు విధ్యుత్ శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. మాస్కులు అడిగినంత మాత్రాన ఇలా సస్పెండ్ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.